ముఖ్యమంత్రి సహాయనిధికి చెక్కుల పంపిణీ

ఆచంట : ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ, ఆచంట మండలాలకు చెందిన నలుగురు దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్షా 75 వేల చెక్కులను ఆచంట ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణకు అందజేశారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాల ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెనుగొండ మండలం పెనుగొండకు చెందిన మోదుకూరి సీతారాం రూ.67,556, దొంగ రావిపాలెంకు చెందిన కోన సీతామహాలక్ష్మి రూ.25 వేలు, వడలి గ్రామానికి చెందిన సూరిశెట్టి నర్సవేణి రూ.16 వేలు, ఆచంటకు చెందిన కోళ్ల చైతన్య నాగు రూ.67,556 నగదు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గెలిచేటి బాబు రాజేంద్రప్రసాద్‌, పెనుమంట్ర మండల టిడిపి అధ్యక్షులు తమనంపూడి శ్రీనివాసరెడ్డి, బిజెపి మహిళా నాయకురాలు బలుసు మాధవీలత, రెడ్డి గుప్తా పాల్గొన్నారు.

➡️