లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ

ప్రజాశక్తి – ఉండి

‘సేవలో తరిద్దాం – పేదల బతుకుల్లో వెలుగులు నింపుదాం’ అని ఉండి లయన్స్‌ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు లయన్‌ వేగేశ్న అనంత లక్ష్మి, లయన్‌ కన్నెగంటి రూత్‌ కళ అన్నారు. శనివారం ఉండి లోని లయన్‌ భూపతిరాజు హరనాధ్‌ రాజు ఇంటి వద్ద పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అనంతలక్ష్మి అధ్యక్షత వహించి ఆమె, రూత్‌ కళ మాట్లాడుతూ నిరాశ్రయులైన వారికి, నిరుపేదలకు సేవ చేయడంలో లయన్స్‌ క్లబ్‌ ఎప్పుడూ ముందుంటుందన్నారు. క్లబ్‌ ఉపాధ్యక్షులు లయన్‌ సత్తి బ్రహ్మారెడ్డి, లయన్‌ గాదిరాజు రంగరాజులు మాట్లాడుతూ దాతలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌, లయన్‌ సాగిరాజు సాంబశివరాజు, ట్రెజరర్‌ లయన్‌ సాగిరాజు సూర్యకుమారి ఆర్థిక సహకారంతో మహిళలకు చీరలు, పురుషులకు ఫ్యాంట్‌, షర్ట్‌లు ఇవ్వటం అభినందనీయమని, ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండే వ్యక్తి సాగిరాజు సాంబశివరాజు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు భూపతిరాజు హరనాధ్‌ రాజు, పాలతీర్ధపు నరసింగరావు, బొండాడ కేశవరావు, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

➡️