ప్రజాశక్తి – కాళ్ల
జన్మభూమిపై మమకారంతో చదువుకున్న పాఠశాలకు సాయం చేయాలనే ఉద్దేశంతో కంతేటి శ్రీనివాసరాజు ఆరు సంవత్సరాల నుంచి విద్యార్థులకు సామగ్రి అందించడం అభినం దనీయమని ప్రాతళ్లమెరక మెయిన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూనపురాజు రామ్మూర్తిరాజు అన్నారు. ప్రాతళ్లమెరక మెయిన్ ప్రాథమిక పాఠశాలలో టిడిపి గ్రామ అధ్యక్షుడు కంతేటి శ్రీనివాసరాజు, కలిదిండి రామచంద్రరాజు ఆర్థిక సహకారంతో విద్యార్థులకు రూ.15 వేల విలువైన విద్యా సామగ్రి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా దాత కంతేటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ కాన్వెంట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యనందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని కళ్యాణి, దాత కలిదిండి రామచంద్రరాజు, కంతేటి సుబ్బరాజు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాలకొల్లు:టిడిపి కూటమి ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కర్నేన రోజా రమణి కోరారు. స్థానిక ఎంఎంకెఎన్ మున్సిపల్ హైస్కూల్, బివిఆర్‌ఎం బాలికల హైస్కూల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు జివి.మహమ్మద్ జానీ, ఫకీరు బాబు, నిర్మలాకుమారి, జనసేన నేతలు పాల్గొన్నారు.