విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ

పాలకొల్లు : పాలకొల్లు పట్టణంలోని జివిఎస్‌వి ఆర్‌ఎం మున్సిపల్‌ పాఠశాలకు అద్దేపల్లి గంగరాజు ధర్మసత్రం నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫౌండర్‌ అండ్‌ ఫ్యామిలీ ఛైర్మన్‌ అద్దేపల్లి మోహన్‌ దాస్‌ ఆధ్వర్యంలో ఆచారి ద్వారా 200 నోట్‌ బుక్స్‌ పంపిణీ చేశారు. ఈ సంస్థ చేసే కార్యక్రమాలను శ్రీఆచారి విద్యార్థులకు వివరించారు. సంస్థ ద్వారా విద్యార్థులకు ఉచిత భోజనం, పుస్తక దానం, ఉచిత హోమియో క్లినిక్‌ ద్వారా పేదలకు మందుల పంపిణీ, పేద మహిళలకు వస్త్రదానం మొదలైన కార్యక్రమాలు సత్రం చేపడుతుందన్నారు. విద్యార్థులు ఈ నోట్‌ బుక్స్‌ ఉపయోగించుకొని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. పాఠశాల హెచ్‌ ఎం.రాయపూడి భవానీప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️