గణపవరం : మానవత సంస్థ ప్రజలకి మరింత సేవలందించాలని గణపవరం ఎంపిడిఒ ఆర్.బేబి శ్రీలక్ష్మీ అన్నారు. శనివారం మానవత జిల్లా నాయకులు కాకర్ల వినాయక కార్యాలయం వద్ద స్థానిక నివాసురాలు ముదునూరి నాగమణి స్వయం ఉపాధికు రూ.6,500 విలువచేసే కుట్టుమిషన్ ఆర్.బేబీ శ్రీలక్ష్మీకి అందజేశారు. లయన్స్ క్లబ్ గణపవరం నాయకులు పి.సత్యనారాయణ మూర్తి, మానవత నాయకులు పాల్గొన్నారు.