మొగల్తూరు : అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. మండల కేంద్రం మొగల్తూరులోని రామాలయం రోడ్డులో ఉన్న టిఆర్‌కె కార్ బజార్‌లో ఆదివారం పాలకొల్లుకు చెందిన ఆపద్బాందు బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయతి సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వాహకులు తణుకుల రామకృష్ణ, నల్లి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆకన ఫణింద్రనాథ్, లయన్స్ మొగల్తూరు శాఖ అధ్యక్షులు వివేక రాంబాబు, వర్ధనపు ప్రసాద్ పాల్గొని రక్తదానం చేసిన యువతకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
