పేద విద్యార్థికి మందులు అందజేత

పాలకొల్లు : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం దగ్గరలో ఉన్న లక్ష్మీ పోలవరం గ్రామానికి చెందిన 5వ తరగతి చదువుతున్న పేద విద్యార్థి చోడిశెట్టి హేమంత్‌ వినరు టైప్‌-1 మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడు. మందుల నిమిత్తం నెలకు రూ.7 వేలు ఖర్చు చేయడం ఆ పేద కుటుంబానికి తలకు మించిన భారంగా మారింది. తెలిసినవారు పాలకొల్లు వాకర్స్‌ క్లబ్‌ సహాయ కార్యక్రమాల గురించి తెలపడంతో వారు క్లబ్‌ను సంప్రదించగా శనివారం వారిని పాలకొల్లుకు రప్పించి, ఆ అబ్బాయికి అవసరమైన వందరోజులకు సరిపడా రూ.22 వేల విలువైన మందులను క్లబ్‌ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు అందించారు. అడిగిన వెంటనే సాయం అందించిన వాకర్స్‌ క్లబ్‌ వారికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి షేక్‌ పీర్‌ సాహెబ్‌, కోశాధికారి పోతుల ఉమాశంకరరావు, ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, సలాది రామచంద్రరావు, క్లబ్‌ సభ్యులు జవ్వాజి కళ్యాణ్‌, కర్రి కిరణ్‌ పాల్గొన్నారు.

➡️