చదరంగం ఆటతో ఆలోచన, శక్తి సామర్థ్యాలు పెంపు

ప్రజాశక్తి – నరసాపురం

చదరంగం ఆడుట వల్ల ఆలోచన, శక్తి సామర్థ్యాలు రెట్టింపవుతాయని బిజిబిఎస్‌ మహిళా కళాశాల అధ్యక్షుడు, వాసవి క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫాస్ట్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌వి.రమణమూర్తి అన్నారు. మంగళవారం నరసాపురం అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో అభయ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్వర్యంలో మాస్టర్‌ చెస్‌ అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ చెస్‌ అసోసియేషన్‌, జిల్లా చెస్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన 7వ నూలి సాయి అభరు మోమొరియల్‌ ఇండియా ఓపెన్‌ రాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ కు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ఏడు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా నిర్విరామంగా సాయి అభరు చెస్‌ పోటీలను నూలి శ్రీనివాస్‌ తన కుమారుడు పేరు మీదుగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. నాలుగేళ్ల చిన్నారుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు ఈ పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువులోనే కాకుండా ఆటలు, క్రీడలు కూడా శిక్షణ ఇప్పించి వారి అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అభయ ట్రస్ట్‌ చైర్మన్‌, బిజిబిఎస్‌ మహిళ కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ నూలి శ్రీనివాస్‌, ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడు చెల్లంచర్ల సుబ్రహ్మణ్యం, కార్యదర్శి రఘు రాములు, అరేటి మృత్యుంజయ పాల్గొన్నారు.

➡️