ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : ఆర్‌డిఒ

ప్రజాశక్తి – యలమంచిలి

మానవాళి మనుగడకు ఎంతో ప్రయోజనం చేకూర్చే మొక్కలను ప్రతి ఒక్కరూ నాటాలని నరసాపురం ఆర్‌డిఒ దాసిరాజు అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రలో భాగంగా స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఆర్‌డిఒ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రకృతి ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా వీటి ద్వారా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇంటికొక మొక్క నాటే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ గ్రంధి పవన్‌కుమార్‌, కార్యాలయ సిబ్బంది, విఆర్‌లు పాల్గొన్నారు.

➡️