ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

ఎపిఒ టి.రోజ్‌లీలా

ప్రజాశక్తి – ముసునూరు

ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటినట్లయితే భవిష్యత్తు తరాల వారికి ఆదర్శప్రాయమని ఎపిఒ టి.రోజ్‌లీలా తెలిపారు. మంగళవారం మండలంలోని లోపూడి, చెక్కపల్లి తదితర గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా మొక్కల నాటడం కార్యక్రమం చేపట్టారు. పలు విధాలుగా మొక్కలు పెంపకం ఆదర్శదాయకమని, ప్రతి మనిషి తప్పనిసరిగా తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఒక మొక్క నాటాలని ఆమె ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించారు.

➡️