ధాన్యం కాటాల పరిశీలన

ప్రజాశక్తి వార్తకు స్పందన

వీరవాసరం : ఈనెల 28న ‘తూకంలో మోసం అరికట్టేదెవరు!’ అనే శీర్షికతో ప్రజాశక్తి పత్రికలో వచ్చిన కథనానికి భీమవరం తూనికలు, కొలతల శాఖ, వీరవాసరం వ్యవసాయ శాఖాధికారులు స్పందించారు. గురువారం వీరవాసరం, బాలేపల్లి పరిసరాలలో రైతుల సమక్షంలో ధాన్యం పట్టుబడి సమయంలో రైతుల సమక్షంలో పరిశీలించారు. తూనికల, కొలతల అధికారి వివి.నాగరాజారావు మాట్లాడుతూ ధాన్యం తూకానికి వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్‌ కాటా తూకంలో ఎటువంటి పొరపాటులు లేవన్నారు. తూకం సమయంలో కాటాలు సక్రమంగా ఉన్నట్టు పరిశీలనలో తేలిందన్నారు. ఇదేవిధంగా మెంటే శంకరావు రైస్‌ మిల్లు వద్ద లారీ తూకాన్ని కూడా పరిశీలించగా అదికూడా సక్రమంగా ఉన్నట్టు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని తూకం వేసేడప్పుడు ఎటువంటి అనుమానం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈయన వెంట మండల వ్యవసాయాధికారి బిన్సిబాబు ఉన్నారు.

➡️