నరసాపురం : ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడాలని డిఎస్‌పి శ్రీవేద అధికారులను సూచించారు. నరసాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీవేదను మంగళవారం నరసాపురం ఎక్సైజ్ స్టేషన్ సిఐ ఎస్.రాంబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. నరసాపురం డిఎస్‌పి కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు సిఐ, ఎస్‌ఐలు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిఎస్‌పి మాట్లాడుతూ నిత్యం తనిఖీలు చేయాలని, తనిఖీల్లో పట్టుబడితే కేసు నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు ఎండీ.జైనులాబ్దిన్, ఖాసీం పాల్గొన్నారు.