100 మందికి కంటి పరీక్షలు

తాడేపల్లిగూడెం: స్థానిక పశువుల ఆసుపత్రి వద్ద శుక్రవారం కంచర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఎంసి మాజీ డైరెక్టర్‌ జగన్నాథరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం వంద మందికి కంటి పరీక్షలు చేశారు. జనసేన 12వ వార్డు ఇన్‌ఛార్జి దస్తగిరి, ఎఎంసి మాజీ డైరెక్టర్‌ కోడేశ్రీ, ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు కంచర్ల రాజా పాల్గొన్నారు.

➡️