రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దు

ఆర్‌డిఒ దాసిరాజు

ప్రజాశక్తి – నరసాపురం

రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, సమీపంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను పొంది ఆర్థికంగా పరిపుష్టి కావాలని నరసాపురం ఆర్‌డిఒ దాసిరాజు సూచించారు. ఈమేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రైతులు అమ్మిన ధాన్యానికి 48 గంటలలోపు రైతు ఆధార్‌ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో ధాన్యం సొమ్ము జమచేయడం జరుగుతుందన్నారు. రైతుల ధాన్యం రైసు మిల్లుకు చేరుకోవడానికి అవసరమైన అంచనా సమయం, రవాణా కాబడిన సమయం, దూరం నిర్ణయించడం జరిగి, దానికనుగుణంగా రైతులు అమ్మకం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసియున్నామన్నారు. రైతులందరూ సకాలంలో ధాన్యాన్ని ఎటువంటి కమిషన్‌ ఏజెంట్‌, దళారుల ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా రైతుల వద్దనుంచి ప్రభుత్వం వారు నిర్ధేశించిన మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు నిర్ధారణ కాబడినట్లయితే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️