పేద కుటుంబానికి ఆర్థిక సాయం

కాళ్ల: కాళ్లకూరు గ్రామానికి చెందిన దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ అధినేత దాట్ల వెంకటరామరాజు పేద కుటుంబానికి ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చారు. కాళ్లకూరుకు చెందిన కొత్త కాలనీకి చెందిన దావులూరి మరియమ్మ(65) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మరియమ్మ మట్టి ఖర్చుల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్‌ సభ్యులు పెన్మత్స నాగరాజు ఆదివారం అందజేశారు. 800 లీటర్ల ఆర్వో వాటర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో దావులూరి సామెల్‌ పాల్గొన్నారు.

➡️