ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం

కాళ్ల: కోమటిగుంట గ్రామంలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం అభినందనీయమని టిడిపి నాయకుడు బోణం శివకుమార్‌ అన్నారు. కోమటిగుంట గ్రామంలో నాలుగు పేదకుటుంబాలకు ఆర్థికసాయం మంగళవారం అందజేశారు. వేగేశ్న నరసింహరాజు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ వి.వెంకటరాయ వర్మ గ్రామంలో ఇల్లు ఎవరు నిర్మించుకున్నా వారికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. కోలనపల్లి ఎంపిటిసి వేగేశ్న సత్యనారాయణరాజు చేతులమీదుగా చెక్కులు అందించారు.

➡️