ప్రజాశక్తి – ఆచంట
మండలంలోని పెదమల్లం పంచాయతీ పరిధి సిర్రా వారి పేట సిర్రా ధనరాజుకు చెందిన తాటాకు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన విషయం విధితమే. ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలి ఉండడంతో, ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన ముఖ్య నాయకులు వారికి అండగా నిలిచి బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు, కొంత నగదును ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జవ్వాది బాలాజీ శ్రీనివాస్, రావి హరీష్, ఎర్రగొప్పుల నాగరాజు, చిట్టూరి శ్రీనివాస్, దిరిశాల అబ్బులు పాల్గొన్నారు.