ప్రజాశక్తి – నరసాపురం
పాఠశాల క్రీడా సమాఖ్య(ఎసిఎఫ్) ఆధ్వర్యంలో ఎల్‌బిచర్ల జెడ్‌పి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి క్రీడాపోటీలు ముగిసాయి. రెండో రోజు బుధవారం అండర్-14, 17 బాలురకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చదరంగం, యోగా, షటిల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. 95 మందిని జిల్లా పోటీలకు ఎంపిక చేసినట్లు అడపా రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఇటిలు రాజశేఖర్, ప్రసాద్ పాల్గొన్నారు.