మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ప్రజాశక్తి – నరసాపురం
నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి శుక్రవారం పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సిబందికి పలు అంశాలపై సూచనలు, సలహాలు చేశారు. ప్రజలు స్థానికంగా ఎదుర్కొనే పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా సమస్యలపై సచివాలయ సిబ్బంది సంయుక్తంగా బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి రోజు సచివాలయ పరిధిలో ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రెయిన్ల ఆక్రమణలను తొలిదశలోనే అడ్డుకోవాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని, పనులను నేరుగా పరిశీలించిన తదుపరే బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామన్నారు. ఇంజినీరింగ్ అధికారులు నూతన రోడ్ల ఏర్పాటు ప్రతిపాదనల్లో తప్పనిసరిగా ఎండ్ టు ఎండ్ రోడ్, డ్రెయిన్లు ఉండేలా చూడాలన్నారు.