ప్రజాశక్తి – ఉంగుటూరు
కీర్తిశేషులు, మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి జయంతి సందర్భంగా మండలంలోని కైకరంలో ఎన్‌టిఆర్ విగ్రహాల వద్ద ఉన్న జిఎంసి బాలయోగి విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మాజీ జెడ్‌పిటిసి చింతల శ్రీనివాస్, గ్రామ సర్పంచి సలగల గోపి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.