పూడికతీత పనులకు శంకుస్థాపన

గణపవరం : కాశిపాడు డ్రెయిన్‌ పూడికతీత పనులను బుధవారం ఉంగుటూరు ఎంఎల్‌ఎ పత్సమట్ల ధర్మరాజు పిప్పరలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశిపాడు మురుగు కాలువలోకి పెంటపాడు మండలం చింతపల్లి, కోరుమిల్లి, మీన వల్లూరు, గణపవరం మండలంలో పిప్పర, కాశిపాడు, గ్రామాలకు చెందిన పోలాలలో మురికి నీరు కాశిపాడు డ్రెయిన్‌ ద్వారా యనమదుర్రు కాలువలోకి రావటం జరుగుతుందని చెప్పారు. డ్రెయిన్‌ పూడిక తీయక పోవటం వల్ల కాలువ పూడుకుపోయి పంట పొలాలలో మురికి నీరు బయటకు వెళ్లక పోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మురికి కాలువ పూడిక తీసి తమ ఇబ్బందులు తొలగించాలని ఆయా గ్రామాలకు చెందిన రైతుల కోరిక మేరకు పూడిక తీత పనులు ప్రారంబించినట్లు చెప్పారు. పూడిక తీత పనులు ప్రారంబించినందుకు రైతులు ధర్మరాజుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి మండల నాయకులు పాల్గొన్నారు.

➡️