వైద్య నిపుణుడు కొండా శ్రీధర్
ప్రజాశక్తి – నరసాపురం
కొవ్వలి రా మ్మోహన్‌నాయుడు కొవ్వలి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఉచిత ఆక్యుపంచర్ వైద్యసేవలు పేదలకు వరంగా నిలుస్తాయని కొవ్వలి ఫౌండేషన్ కార్యదర్శి, ఆక్యుపంక్చర్ వైద్య నిపుణుడు కొండా శ్రీధర్ అన్నారు. ఆదివారం నరసాపురం పట్టణం 25 వార్డు వీవర్స్ కాలనీలో కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆక్యుపంక్చర్ శిబిరంలో రోగులకు శ్రీధర్ వైద్య సేవలు అందించి మాట్లాడారు. సర్వ రోగ నివారిణి ఆక్యుపంక్చర్ వైద్యమన్నారు. ఎలాంటి మందులు, ఇంజెక్షన్లు, శస్త్ర చికిత్సలు అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులను ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా ని వారించవచ్చునని అన్నారు. పేదలకు, అనాధలకు, ఆపదలో ఉన్న వారికి కొవ్వలి ఫౌండేషన్ ద్వారా తమ కుటుంబ సభ్యుడు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ న్నాయుడు సేవలను అం దిస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా తాము కూడా తనవంతు సేవలు అందిస్తున్నామని శ్రీధర్ తెలిపారు. సుమారు 100 మంది రోగులకు వైద్య సేవలను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంకు భాస్కర నాయుడు, బట్టా స్వామి, కోటి, సూరిబాబు, బోగి రెడ్డి ముత్యం, అండ్రాజు లక్ష్మణ్ ఉన్నారు.