తణుకు : రోటరీ ఒక సేవా సంస్థ అని, మనిషి పుట్టిన దగ్గర నుంచి మట్టిగా మారే వరకూ మేము సమాజానికి సేవ చేస్తామని రోటరీ క్లబ్ కార్యదర్శి కఠారి సిద్ధార్ధ అన్నారు. బుధవారం రోటరీ క్లబ్‌లో మల్లిన అరుణసారధి పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో డివైన్ ఐ ఫౌండేషన్ పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి, వేమగిరి వారి సాంకేతిక సహకారంతో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కరీమ్ షేక్ వైద్య సహాయం అందించగా, ప్రాజెక్టు మేనేజర్ చంటిబాబు ఆపరేషన్ అవసరమైన వారికి సలహాలు ఇచ్చారు. మొత్తం 150 మందిని పరీక్షించగా అందులో 15 మంది కి ఆపరేషన్‌కు వేమగిరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మొత్తం 150 మందికి ఉచితంగా అవసరమైన మందులు అందించారు. అక్కిన కాశీవిశ్వనాధం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, మేడికొండ వెంకటేశ్వరరావు, కెటివి రెడ్డి పాల్గొన్నారు.
