ఉచిత వైద్య సేవలు అభినందనీయం’

ప్రజాశక్తి – కాళ్ల

సీసలిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని మాజీ సర్పంచి కట్రేడ్డి శ్రీనివాసరావు అన్నారు. సీసలి హైస్కూల్లో జయలక్ష్మి రొయ్యల కంపెనీ, భీమవరం ఇంపీరియల్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందన్నారు. తద్వారా సకాలంలో చికిత్స పొందొచ్చన్నారు. శిబిరంలో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జయలక్ష్మి రొయ్యల కంపెనీ ఎమ్‌డి కుదరవల్లి రమేష్‌బాబు, కంపెనీ డైరెక్టర్‌ జాస్తి మహినర్‌, కంపెనీ మేనేజర్‌ గుప్త వెంకట రామ్మోహన్‌రావు, నూకలు భోగేంద్రబాబు, పాల్గొన్నారు.

➡️