వృద్ధులకు ఉచిత వైద్య సేవలు

ప్రజాశక్తి – తణుకు

సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, నిసా ఫౌండేషన్‌ వారు సంయుక్తంగా నిర్వహించు ఇంటింటికీ వైద్యం కార్యక్రమంలో భాగంగా ఇంటికే పరిమితమై అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు సంచారశకటం ద్వారా వైద్యులు ఆదివారం ఉచిత వైద్యసేవలు అందించారు. ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్‌ హుస్సేన్‌అహ్మద్‌, డాక్టర్‌ సుంకవల్లి నీలుమహేంద్ర, డాక్టర్‌ సాతులూరి అనుస్మితలు తణుకు, చివటం ప్రాంతాల్లో పర్యటించి సుమారు ఐదుగురు వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించారు. డాక్టర్‌ కెవి రావు ఇండియా నెట్‌వర్క్‌ ఫౌండేషన్‌ అమెరికా వారి ఆర్థిక సహకారంతో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లిన రామచంద్రరావు జన్మదిన సందర్భంగా వారి నివాసంలో సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకరచౌదరి, సంఘ కోశాధికారి అర్జి భాస్కరరావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్యసేవలు కోరువారు స్వయంగా గాని, లేదా 9985343530 నెంబర్‌కి సంప్రదించవచ్చన్నారు.

➡️