ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు 

Jan 23,2025 12:51 #West Godavari District

ప్రజాశక్తి-ఉండి: యువగళం పాదయాత్రతో టిడిపి ను అధికారంలోకి తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించారని ఉండి డీసీ ఉపాధ్యక్షుడు మంతెన సాయి లచ్చిరాజు, మాజీ జడ్పీటీసీ కాగిత మహంకాళి అన్నారు. గురువారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలను టిడిపి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు కాగిత బుజ్జి ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంతెన సాయి లచ్చిరాజు, కాగిత మహంకాళి మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొదటి నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. యువగళం పాదయాత్రతో రాష్ట్ర ప్రజల అభిమానాన్ని పొందడం ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరిమెరక శ్రీను, గురుగుబిల్లి సత్యనారాయణ, పెద్దింటి బాబు, కర్రి శ్రీను, పోలుబోతు రాము, మజ్జి కృష్ణ ప్రసాద్, నల్లా వల్లీ, గోపిరాజు, సారేపల్లి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

➡️