ప్రజాశక్తి – పాలకొల్లు
నైపుణ్యం, అంకితభావం, అద్భుతమైన ప్రదర్శనతో పాలకొల్లుకు చెంది కోరంగిలోని కెఐఇటి కళాశాల క్యాడెట్ సానబోయిన దేవ హర్షిణి, ప్రతిష్టాత్మక ఢిల్లీలోని రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొంది. ప్రతి క్యాడెట్ కల అయిన ఆల్ ఇండియా రిపబ్లిక్ డే క్యాంప్‌లో (ప్రైమ్ మినిస్టర్ ర్యాలీ-ఢిల్లీ) పాల్గొని గుర్తింపు పొందింది. ఆమె అసాధారణ ప్రదర్శన ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి పెట్టింది. ఈ క్యాంప్‌లో ఆమె అత్యుత్తమ నాయకత్వం క్రమశిక్షణ ప్రదర్శించింది. ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రపతిని కలిసి కళాశాలకు తిరిగి వచ్చిన దేవ హర్షిణిని కళాశాల విద్యార్థి, అధ్యాపక సంఘం ఘనంగా స్వాగతించింది. కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కేర్ టేకర్ అసోసియేట్ ఎన్‌సిసి ఆఫీసర్ హాజరై ఆమె విజయాలను వివరించి ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో దేవ హార్షిణి పాల్గొనడం తమ కళాశాలకు గర్వకారణమన్నారు.