ప్రజాశక్తి – నరసాపురం
మండలంలోని సీతారాం పురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) కళాశాలలో తృతీయ సంవత్సరం సిఎస్‌ఇ బ్రాంచ్‌కు చెందిన పి.వివేక్, ఎస్.భార్గవి, ఎం.సాయి సభ్యుల బృందం ఇటీవల బెంగళూరు ఐఇటి సంస్థ నిర్వహించిన హ్యాక్ థాన్ పోటీల్లో ట్రాన్సిట్ టెక్నీస్‌గా ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా విజేతలు ట్రోఫీ, ధృవ పత్రాలు, అలాగే అర్కాడిస్ ప్రయివేట్ లిమిటెడ్‌లో ఇంటర్న్ షిప్ అందుకున్నారు. దీంతో పాటు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాలకు ఐఇటి ఆన్ క్యాంపస్ అత్యుత్తమ పురస్కారం, స్వర్ణాంధ్ర సిఎస్‌సి విద్యార్థి పి.వివేక్‌కు నెక్స్ట్ జెన్ ఇన్నోవేషన్ 2025 అవార్డు, జిబి.క్రిస్టినా మేడమ్‌కు బెస్ట్ ఐఇటి ఆన్ క్యాంపస్ ఫ్యాకల్టీ అవార్డు లభించాయి. 5 బాహుమతులతో స్వర్ణాంధ్ర కళాశాల ప్రభంజనం సృష్టించింది. బహు మతులు సాధించిన విద్యార్థులను కళాశాల ఛైర్మన్ కెవి. సత్యరానారాయణ, ట్రెజరర్ కె.వెంకటేశ్వరస్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, కళాశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ అభినందించారు.గోకార్డు ఛాంపియన్ షిప్ పోటీల్లోసీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ (అటానమస్) కళాశాలలో తృతీయ సంవత్సరం మెకానికల్ బ్రాంచుకు చెందిన విద్యార్థులు, స్పార్క్ రేసర్స టీమ్ కెప్టెన్ వై.రాంబాబు, వైస్ కెప్టెన్ పి.చరణ్ ప్రతిభ చూపారు. ఇటీవల ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ టెక్కలి శ్రీకాకుళం కళాశాల వారు నిర్వహించిన గోకార్ట్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో స్వర్ణాంధ్ర విద్యార్థులు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు, రూ.పది వేల నగదు కైవసం చేసుకున్నారు. బహుమతులు సాధించిన విద్యార్థులను కళాశాల ఛైర్మన్ కెవి. సత్యరానారాయణ, ట్రెజరర్ కె.వెంకటేశ్వరస్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, కళాశాల ప్రిన్సిపల్ ఎస్.సురేష్‌కుమార్ అభినందించారు.