ఆరోగ్యసహాయకులను పునర్‌ నియమించాలి

సంఘం రాష్ట్ర కన్వీనర్‌ ప్రసాద్‌

భీమవరం టౌన్‌ : మెరిట్‌లో వుండి కూడా అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించబడిన వైద్య, ఆరోగ్య శాఖలోని వందలాది మంది ఆరోగ్య సహాయకులను తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పారామెడికల్‌ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ జివివి.ప్రసాద్‌ కోరారు. సోమవారం భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పును అనుసరించి ఆరోగ్యసహాయకులను తక్షణమే పునర్‌ నియమించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.

➡️