పాలకొల్లులో ఆధునిక కల్యాణ మండపం

Feb 12,2024 14:26 #West Godavari District
పాలకొల్లులో ఆధునిక కల్యాణ మండపం

ప్రారంభించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు వంటి చిన్న పట్టణాల్లో ఆధునిక మినీ కల్యాణ మండపాలు ప్రజలకు అందుబాటులో ఉండటం హర్షనీయం అని రాష్ట్ర ఫౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పాలకొల్లు అడబాల గ్రూపుకు చెందిన ఎ కన్వెన్షన్ ను మంత్రి ప్రారంభించారు. జిల్లా ముఖ్యులు గతంలో దిండి, పాలవల్లి వంటి అతిధి గృహాలకు వెళ్ళేవారని అయితే ఇప్పుడు పట్టణంలోనే అందుబాటులో ఉండటం ఖర్చు, సమయం కలిసివస్తుందని యాజమాని అడబాల వెంకటరమణను అభినందించారు. ఇంకా ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చేగొండి హరరామ జోగయ్య, పాలకొల్లు ఇన్ చార్జి గుడాల గోపి, టిటిడి సభ్యులు మేకా శేషుబాబు, ఎంఎల్సి కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, గుణ్ణం నాగబాబు యడ్ల తాతాజీ , చెల్లెం ఆనంద ప్రకాష్, పోలిశెట్టి దాసు తదితరులు పాల్గొన్నారు.

➡️