పాలకొల్లులో కార్మిక సంఘాల నిరసన

Feb 16,2024 11:34 #West Godavari District
industrial strike against bjp govt policies wg

ప్రజాశక్తి-పాలకొల్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రైవేటీకరణ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పాలకొల్లులో వివిధ కార్మిక సంస్థలు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా కనీస వృద్ధాప్య పింఛన్ 7,000 చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం వల్ల లక్షలాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని ప్రైవేటీకరణ తగదని కార్మికులు నినాదాలు చేశారు. ఈ ధర్నాలో మండల సిఐటియు కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్, కార్మిక నేతలు గుబ్బల సత్యనారాయణ, గంగరాజు, పురుషోత్తం, జి వెంకటేశ్వరరావు, ఆకుల ప్రసాద్, వీర సత్యనారాయణ, తమ్మ సూర్యనారాయణ, మళ్ళుల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️