ఆకివీడు : మండలంలోని సిద్దాపురం ప్రాంతంలో సార్వాకు 140 రోజుల కాలపరిమితి నిడివిగల మధ్యస్థ సన్నగింజరకం సరిపోతుందని మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. శుక్రవారం మండలంలోని సిద్దాపురంలో రైతు మురళీ కృష్ణంరాజు పంట భూమిలో పండించిన వరి రకాలను శాస్త్రవేత్తలు వై.సునీత, డి.రోజ, డాక్టర్ మల్లికార్జునరావు, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ రవితేజ, డాక్టర్ రజిత, స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంటియు 1310, ఎంటియు 1075, సిఆర్ 3598-1-4-2-1 సంకరణం చేసిన రకం 140 రోజుల పంట అని వివరించారు. ఈ రకం గింజ రాలిక తక్కువగా ఉంటుందని, అగ్గి తెగులును బాగా తట్టుకుంటుందని వారు తెలిపారు. ఈ లక్షణాల వల్ల ఈ ప్రాంతంలో ఈ రకం అనుకూలమవుతుందన్నారు. కెవికె ఉండి ఎంటియు 1426, ఆర్‌ఎన్‌ఆర్ 15 0 48, చెక్‌మినీ కిడ్స్‌ను రైతులు అందజేశారు. ఉండి కెవికె శాస్త్రవేత్త మల్లికార్జునరావు, స్థానిక సహాయ సంచాలకులు కెఎఎస్‌ఎస్.శ్రీనివాసరావు, ఎ.ప్రియాంక పాల్గొన్నారు.