బాణసంచా దుకాణాల్లో తనిఖీలు

ప్రజాశక్తి – తణుకు రూరల్‌

బాణసంచా దుకా ణాలకు పూర్తి అనుమతులు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తణుకు మండల తహశీల్దార్‌ డివిఎస్‌ఎస్‌.అశోక్‌వర్మ హెచ్చరించారు. తణుకు మండల పరిధిలో దువ్వ వద్ద ఉన్న బాణసంచా దుకాణాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో విక్రయిస్తున్న టాపాసులు వాటి నాణ్యత, ధరలను పరిశీలించారు. దుకాణాలకు సంబంధించిన అనుమతుల పత్రాలను పరిశీలించారు. అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన బాణసంచా విక్రయించాలని, కాలంచెల్లిన వాటిని విక్రయించరాదని వ్యాపారులకు సూచించారు. ఆయన వెంట ఆర్‌ఐ భవానీ, సిబ్బంది ఉన్నారు.

➡️