సీతారామ్‌ను కలిసిన జబర్దస్త్‌ నటుడు

భీమవరం రూరల్‌:భీమవరం పట్టణంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో జబర్దస్త్‌ నటుడు పంచ్‌ ప్రసాద్‌ దంపతులు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థి అంకెం సీతారామ్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంకెం సీతారామ్‌కు ప్రసాద్‌ పుష్ఫగుచ్ఛం అందజేసి సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అంకెం సీతారామ్‌ మాట్లాడుతూ ప్రసాద్‌ తన బాల్య స్నేహితుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనం రవికుమార్‌ పాల్గొన్నారు.

➡️