అందరి సిఎంల ఆస్తుల మొత్తం కంటే జగన్ ఆస్తి ఎక్కువ

Oct 31,2024 13:53 #West Godavari District

 మంత్రి నిమ్మల ఆరోపణ

ప్రజాశక్తి-పాలకొల్లు : జగన్ సీఎం గా ఉండగా అందరి సీఎంల కన్నా జగన్ ఆస్తి ఎక్కువగా ఉండటమే కాకుండా అందరి ఆస్తి కలిపిన జగన్ ఆస్తి ఎక్కువ అని సర్వే రిపోర్ట్ లో తేలిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. దీపావళి సందర్భంగా గురువారం పాలకొల్లులోని మంత్రి కార్యాలయంలో 28 మందికి 11,20,000 సిఎంఆర్వై చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. 2004లో డా. వైయస్ ఎన్నికల అఫిడవిట్లో కోటి 80 లక్షల మాత్రమే చూపించారని ప్రస్తుతం వేల కోట్ల ఆస్తి కోసం కుటుంబ కొట్టుకోవడం గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. వైసిపి అధినాయకత్వమే ఇలా ఉంటే ఇక పరిపాలన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజలకు దిశ, దశ చూడవలసిన ఒక పార్టీ నాయకత్వమే ఇలా లక్షల కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించి కొట్టుకుంటే ఇక సామాన్య ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. డా. వైయస్ సీఎంగా ఉండగా ఆస్తి సంపాదించుకోవడమే ధ్యేయంగా జగన్ పని చేశారని ప్రజలు ఆయనకు పట్టం కట్టిన తరువాత ఉన్న ఆస్తులు కాపాడుకోవడం అక్రమ ఆస్తులు సంపాదించుకోవడంతోనే పాలన చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల లోటుతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఒక కుటుంబం లక్షల కోట్ల ఆస్తి కోసం కొట్టుకుంటోందని విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జనసేన ,బిజెపి నేతలతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఇంకా మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ టిడిపి నేతలు మామిడి శెట్టి పెద్దిరాజు, బిజెపి నేత కబర్ధి, జనసేన నేత బోనం చినబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️