ప్రజాశక్తి – పాలకోడేరు
విస్సాకోడేరు సెయింట్ జాన్స్ వెల్ఫేర్ సొసైటీ అధినేత డాక్టర్ డిఆర్.స్వర్ణలతకు ఝాన్సీ లక్ష్మీబాయి సూపర్ ఉమెన్ (2025) అవార్డు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం హైదరాబాదులోని రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్‌లో శ్రీ కొమ్మూరి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధినేత డాక్టర్ కె.శ్రీనివాస్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా స్వర్ణలత అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి సూపర్ ఉమెన్ అవార్డు రావడం ఆనందంగా ఉందని, అదే సమయంలో సమాజం పట్ల మరింత బాధ్యత పెంచిందని అన్నారు. సమాజానికి ఝాన్సీ లక్ష్మీబాయి అందించిన సేవలు మరుపు రానివన్నారు. ఈ అవార్డు తీసుకోవడం జీవితంలో మరిచిపోలేనిదన్నారు.