పెనుమంట్ర : బాస్కెట్ బాల్ క్రీడకు అంతర్జాతీయ ప్రఖ్యాతి తెచ్చిన మార్టేరు గ్రామం అని, అలాంటి చోట పుట్టిన పీడీ కర్రి కృష్ణారెడ్డి ధన్యజీవి అని, మాజీ మంత్రి, ఆచంట ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణ అన్నారు. ఆదివారం రాత్రి మార్టేరులోని ఎస్‌విజి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎస్‌విజి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఉద్యోగవిరమణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుదీర్ఘకాలం పిఇటిగా, పిడిగా సేవలు అందించి, ఎందరో క్రీడా కారులను, తయారు చేయడం గొప్ప విషయం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ బాస్కెట్ బాల్ అధ్యక్షులు చిర్ల బాలాజీ రెడ్డి, నరసాపురం ఆర్‌టిసి డిపో మేనేజర్ సత్తి సుబ్బన్న రెడ్డి పాల్గొన్నారు.
