ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల శ్రమదానం

ప్రజాశక్తి – పాలకొల్లు

పాలకొల్లు ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి సందర్భంగా కళాశాల, పేరుపాలెం బీచ్‌లో క్లీనింగ్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.రాజరాజేశ్వరి అధ్యక్షతన కళాశాలలో క్యాంపస్‌ క్లీనింగ్‌ ప్రోగ్రాం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌, సిబ్బంది, విద్యార్థులు జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్స్‌ 1, 2, ఇతర అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను పేరుపాలెం బీచ్‌ క్లీనింగ్‌కు తీసుకుని వెళ్లారు. పేరుపాలెంలో నెహ్రూ యువ కేంద్రం వెస్ట్‌ గోదావరి వారి ఆధ్వర్యంలో బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం క్లీన్‌ డ్రైవ్‌లో పాలకొల్లు విద్యార్థులు చురుకుగా పాల్గొని బీచ్‌లో ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారం మొదలైన వాటిని సేకరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ వి.విజయలక్ష్మి, కె.శివకృష్ణ, వి.శిరీష, బి.ఆశాజ్యోతి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️