ప్రజాశక్తి – తణుకు రూరల్
తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరిధిలో వచ్చిన దరఖాస్తులకు ఈ నెల 10న నిర్వహించాల్సిన లాటరీని ఎంఎల్‌సి ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడినట్లు తణుకు ఎక్సైజ్ సిఐ ఎస్.మణికంఠరెడ్డి తెలిపారు. లాటరీ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.తాడేపల్లిగూడెం : ఎంఎల్‌సి ఎన్నికల కారణంగా సోమవారం జరగాల్సిన గీత కులాల మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వాయిదా పడిందని తాడేపల్లిగూడెం ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్వరాజ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మద్యం షాపుల లాటరీ తేదీని తెలియజేస్తామని తెలిపారు. పెనుమంట్ర : ఈ నెల 10వ తేదీ సోమవారం జరగాల్సిన గీత కులాలకు రిజర్వు చేసిన మద్యం షాపుల ఎంపికకు సంబంధించి లాటరీ ప్రక్రియ ఎంఎల్‌సి ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడిందని తణుకు ఎక్సైజ్ సిఐ సత్తి మణికంఠ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో లాటరీ ప్రక్రియ జరిగే తేదీ తెలియజేస్తామని, దరఖాస్తుదారులు విషయాన్ని గమనించాలని కోరారు.నరసాపురం: నరసాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన 3 మద్యం షాపుల టెండర్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ ఎస్.రాంబాబు మాట్లాడుతూ నరసాపురం పరిధిలో మూడు మద్యం షాపులకు 73 దరఖాస్తులు వచ్చాయని, వాటికి లక్కీ డ్రా సోమవారం జరగాల్సి ఉండగా ఎంఎల్‌సి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల వాయిదా పడినట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు త్వరలోనే డ్రా తేదీని ప్రకటిస్తామని తెలిపారు.