పాలకొల్లు : మంగళగిరి టిడిపి కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా రెండు కాళ్లు లేని శోభ అనే వికలాంగురాలు రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు తొలగించారని, వంద శాతం సదరన్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ గత వైసిపి ప్రభుత్వంలో విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే ఆంక్షలతో పెన్షన్ తొలగించారంటూ మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందించి పెన్షన్ పరిష్కారానికి సిఎం ఆఫీస్‌కు తెలిపి న్యాయం చేయమని కోరారు. తమ దగ్గరకు వచ్చే ప్రజలకు సాయం అందించడం తమ బాధ్యత, ధర్మమని పేర్కొన్నారు.
