పశువులకు టీకాలు

మొగల్తూరు:రైతులు పశువులకు గొంతువాపు నివారణ టీకాలు వేయించాలని పశు వైద్యురాలు జి.నీలిమ సూచించారు. మండలంలోని కెపి.పాలెంలో మంగళవారం పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రైతులకు పలు సూచనలు చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తోందని తెలిపారు. రైతులు నిర్లక్ష్యం చేయకుండా పశువులకు టీకాలు వేయించాలన్నారు.

➡️