ఎంఎల్‌ఎ నాయకర్‌ను కలిసిన పలువురు

ప్రజాశక్తి – నరసాపురం

నరసాపురం జనసేన ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆయనకి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శనివారం నరసాపురం టిడిపి ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు డాక్టర్‌ శిరిగినీడి రాజ్యలక్ష్మి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పొత్తూరి రామరాజు మాట్లాడుతూ కూటమితో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చంద్రబాబు అనుభవంతో, పవన్‌ కళ్యాణ్‌ ఆశీస్సులతో రాష్ట్రం, నియోజక వర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వాతాడి ఉమా పాల్గొన్నారు.

➡️