మొగల్తూరు : శాసనమండలి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో సోమవారం మొగల్తూరు పంచాయతీలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు తొలగింపు, విగ్రహాలకు ముసగులు వేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ముచ్చర్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఎన్నికల నియమావళి పనులను చేపట్టారు.
