ఆరుగురు వృద్ధులకు వైద్య పరీక్షలు

ప్రజాశక్తి – తణుకు

సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, నిసా ఫౌండేషన్‌ వారు సంయుక్తంగా నిర్వహించు ఇంటింటికీ వైద్యం కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నేత్రవైద్యులు డాక్టర్‌ హుస్సేన్‌ అహ్మద్‌, జనరల్‌ వైద్యులు డాక్టర్‌ నీలు మహేంద్ర, సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకరచౌదరిలు సజ్జాపురం ప్రాంతంలో పర్యటించి ఆరుగురు వృద్ధులకు ఉచిత వైద్యసేవలు అందజేశారు. సంఘ సభ్యులు పాతూరి శివన్నారాయణ ఆర్ధిక సహకారంతో ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిజిజాల నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య సేవలు కోరువారు స్వయంగా గాని, సెల్‌ 9985343530 నెంబరును సంప్రదించవలెనని తెలియజేశారు.

➡️