ఆరుగురు వృద్ధులకు వైద్య పరీక్షలు

తణుకు : సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, నిసా ఫౌండేషన్‌ వారి సంయుక్తంగా నిర్వహించు ఇంటింటి వైద్యంలో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్‌ హుస్సేన్‌అహ్మద్‌ తణుకు, పైడిపర్రు పరిసరప్రాంతాల్లో పర్యటించి ఆరుగురు వృద్ధులకు ఉచిత వైద్యం అందజేశారు. నల్లజర్ల వెంకటేశ్వరరావు(వెంకన్న) ఆర్ధిక సహాయంతో ఉచిత మందులు పంపిణీ చేశారు. ప్రముఖ ఆర్ధోపెడిక్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ అచ్యుతరామయ్య పాల్గొన్నారు.

➡️