ప్రజాశక్తి – పాలకొల్లు
స్థానిక వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల్లో జాప్యంపై సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలోని నిర్లక్ష్యాన్ని వీడి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. పనుల్లో నాణ్యతా లోపాలను సరిదిద్దకపోతే సంబంధిత అధికారులు, ఏజెన్సీపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున సిఎం సహాయ నిధిని అందిస్తుందని చెప్పారు.