ప్రజాశక్తి – భీమవరం టౌన్
ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. స్థానిక ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి యరకరాజు శ్రావ్యవర్షిణికి బస్సు ఫీజు నిమిత్తం రూ.15 వేలు దిరుసుమర్రు చంటి రాజు సహకారంతో ఎంఎల్‌ఎ అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ చదువుకుని ఉజ్వల భవిష్యత్తును అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణాధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, చల్లా రాము, కొప్పినిడి బాబీ, కారుమూరి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.యువత సేవాభావం అలవర్చుకోవాలి పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లకు దాతలందిస్తున్న సహకారం అద్వితీయమని ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం మండలం అనాకోడేరు మాజీ సర్పంచి వనిమ రుద్ర భాస్కరరావు అన్న క్యాంటీన్‌కు రూ.10,116 విరాళంగా ఎంఎల్‌ఎ అంజిబాబుకు అందించారు. ఎంఎల్‌ఎ మాట్లాడుతూ దాత భాస్కరరావు పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సహకారం అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలతోపాటు విజ్జురోతి రాఘవులు పాల్గొన్నారు.