తణుకు : ప్రతీ ఒక్కరూ క్రీడల్లో పాల్గొని గెలుపు, ఓటములను సమదృష్టితో స్వీకరించాలని మాంటిస్సోరి స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు అన్నారు. తణుకు పట్టణంలో స్థానిక మాంటిస్సోరి స్కూల్‌లో సోమవారం 36వ వార్షిక క్రీడోత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు జాతీయ పతాకావిష్కరణ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఓటమి రేపటి విజయానికి తొలిమెట్టు అని, క్రీడల వల్ల విద్యార్థుల్లో శారీరక, దేహ దారుఢ్యం, మానసిక ఉల్లాసం, చక్కని ఆరోగ్యం కలుగునన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం.లక్ష్మీ, వ్యాయమ ఉపాధ్యాయులు పి.శివ పాల్గొన్నారు.
