తాడేపల్లిగూడెం: గత రెండు రోజులుగా మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న జనవాణి కార్యక్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక వికలాంగురాలు ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందించింది. తనకు ట్రై సైకిల్ కావాలని కోరడంతో సొంత నిధులతో ట్రై సైకిల్ కొని మంగళవారం పార్టీ కార్యాలయం వద్ద రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఎంఎల్‌సి పి.హరిప్రసాద్ చేతుల మీదుగా తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు.
