నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీలో ఉంటా 

Mar 31,2024 12:28 #West Godavari District

మాజీ సర్పంచ్ కూనపరెడ్డి రంగారావు
ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గ ఎమ్మేల్యే అభ్యర్ధిగా ఒక రాజకీయ పార్టీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన విద్యా వంతుడు, మేధావి పోటీలో నిలుస్తారని నర్సాపురం మండలం యర్రంశెట్టి పాలెం గ్రామ మాజీ సర్పంచ్ కూనపరెడ్డి వీరవెంకట విజయ రంగారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. నర్సాపురం నియోజకవర్గానికి చెందిన కాపు సంఘియుడుగా ఉన్న ఈయనకు ఇతర సామాజికవర్గాలతోను స్నేహపూరిత సత్సంబంధాలు ఉన్నాయని రంగారావు తెలిపారు. ఉన్నత కుటుంబానికి చెందిన వాడు కావడమే కాకుండా సమాజానికి, పేదలకు అత్యుత్తమ సేవలు అందించి మంచి సేవా తత్పరుడిగా గుర్తింపు పొందారని అన్నారు. ఈయనకు రాజకీయంలో కూడా విశేష అనుభవం ఉందని రంగారావు తెలిపారు. త్వరలో నర్సాపురం నియోజకవర్గ ఓటర్లను ఆయన కలుస్తారని రంగారావు తెలియజేశారు.

➡️